అంతర్జాతీయం (International) జాతీయం (National) వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

హైజంప్‌లో రజతం సాధించిన నిషాద్‌ కుమార్‌!!

టోక్యో పారాలింపిక్స్‌లో ఐదోరోజు భారత్‌కు మరో రజత పతకం దక్కింది. కొద్దిసేపటి క్రితం జరిగిన పురుషుల హైజంప్‌ T47 పోటీల్లో భారత అథ్లెట్‌ నిషాద్‌ కుమార్‌ 2.06 మీటర్ల ఎత్తు దూకి రెండో స్థానంలో నిలవడంతో అతడు పారాలింపిక్స్‌లో రజతం సాధించడమే కాకుండా తన పేరిట ఉన్న ఆసియా అత్యుత్తమ రికార్డును కూడా సమం చేశాడు.

నిషాద్‌ ఈ ఏడాదిలోనే 2.06 మీటర్ల హైజంప్‌ చేయడం ద్వారా ఆసియాలో అత్యుత్తమ వక్తిగత ప్రదర్శన చేసిన పారా అథ్లెట్‌గా నిలిచాడు. ఇక ఈ పోటీల్లో అమెరికాకు చెందిన టౌన్‌సెండ్‌ రోడ్రిక్‌ 2.15 మీటర్ల ఎత్తు దూకి స్వర్ణ పతకం చేజిక్కించుకున్నాడు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    7
    Shares
  • 7
  •  
  •  
  •  
  •