అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) వార్తలు (News)

పంజ్‌షీర్‌లో ఇంటర్నెట్ కట్ చేసిన తాలిబన్లు!!

అఫ్ఘానిస్తాన్ లోని పంజ్‌షీర్ ప్రావిన్స్‌లో మాజీ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ ట్విట్టర్ ద్వారా బాహ్య ప్రపంచానికి పంపిస్తున్న సమాచారానికి అడ్డుకట్ట వేసేందుకే తాలిబన్ లు ఇంటర్నెట్ ని బంద్ చేశారు. ప్రస్తుతం అప్ఘానిస్తాన్ లో ఇప్పటికీ తాలిబన్ల వశం కాని ప్రాంతం ఫ్రావిన్స్ పంజ్‌షీర్. ఈ నేపథ్యంలో ప్రావిన్స్ మాత్రం తాలిబన్లకి అందని ద్రాక్షగానే మారింది. తాలిబన్ వ్యతిరేకులు పంజ్‌షీర్‌లో ఒక్కటై వారికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. తాలిబన్ వ్యతిరేక కూటమి(నార్తర్న్అలయన్స్)వ్యవస్థాపకుడు, లెజండరీ అఫ్ఘాన్ రెబల్ కమాండర్ అహ్మద్ షా మసౌద్ కుమారుడైన అహ్మద్ మసౌద్ నేతృత్వంలో షంజ్ షీర్ వేదికగా తాలిబన్ వ్యతిరేక పోరాటం జరుగుతోంది. అప్టాన్ సైనికులు,అఫ్ఘానిస్తాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ కూడా పంజ్ షీర్ లో ఉన్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •