జాతీయం (National) వార్తలు (News)

నేటి మార్కెట్ల తీరు..భలే జోరు!!

నేటి దేశీయస్టాక్ మార్కెట్లు ఉదయమే ఉత్సాహంగా మొదలై రోజు మొత్తం అదే తీరులో సాగి ముదుపరులకు లాభాల పంటను పండించాయి. సెన్సెక్స్‌ 56,329 పాయింట్ల వద్ద లాభాల్లో ఆరంభమై ఇంట్రాడేలో 56,958 పాయింట్ల వద్ద గరిష్ఠ స్థాయికి చేరి చివరకు 765 పాయింట్ల లాభంతో 56,889 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 225 పాయింట్లు పెరిగి 16,931 వద్ద స్థిరపడింది. ఒక దశలో నిఫ్టీ 16,951 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, నెస్లే ఇండియా షేర్లు తప్ప మిగతా అన్ని కంపెనీల షేర్లు లాభపడ్డాయి. అత్యధికంగా భారతీ ఎయిర్‌టెల్‌ 5.19%, యాక్సిస్‌ బ్యాంక్‌ 4%, టాటాస్టీల్‌ 3.75%, టైటన్‌ 3.46%, మారుతీ 3.03%, బజాజ్‌ ఫినాన్స్‌ 2.64%, ఎస్‌బీఐ 2.52%, ఏషియన్‌ పెయింట్స్‌ 2.33%, ఎంఅండ్‌ఎం 2.22%, రిలయన్స్‌ 2.12% లాభపడ్డాయి. ఒక్క ఐటీ మినహా అన్ని రంగాల షేర్లు లాభాల బాటలో నడవడం గమనార్హం!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •