వార్తలు (News)

శ్రీచైతన్య విద్యాసంస్థలో 60మందికి కరోనా పాజిటివ్!!

బెంగళూరులోని శ్రీచైతన్య విద్యాసంస్థలో ఏకంగా 60 మంది విద్యార్థులకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధరణ కావడంతో విద్యాసంస్థను అక్టోబర్​ 20 వరకు మూసివేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది.

మొత్తం 480 మందికి టెస్టులు చేయగా వారిలో 60 మందికి కొవిడ్​ పాజిటివ్‌గా తేలినట్లు బెంగళూరు అర్బన్​​ డిప్యూటీ కమిషనర్​ మంజునాథ్​ తెలిపారు. కానీ పాజిటివ్​గా తేలిన వారిలో ఇద్దరికి మాత్రమే లక్షణాలు ఉన్నాయని, భయపడాల్సిందేమీ లేదని వివరించారు. వైరస్ సోకిన విద్యార్థుల్లో 46 మంది కర్ణాటక వాసులు కాగా మిగిలిన 14 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని చెప్పారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    7
    Shares
  • 7
  •  
  •  
  •  
  •