క్రైమ్ (Crime) వార్తలు (News)

డిగ్రీ ప్రశ్నా పత్రం లీక్ కలకలం??

చిత్తూరు జిల్లా తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వర్సిటీ పరిధిలో డిగ్రీ ప్రశ్నా పత్రం లీక్ అవ్వడం స్థానికంగా కలకలం రేపింది. నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మేనేజింగ్‌ అకౌంటింగ్‌ పరీక్ష జరగాల్సి ఉండగా బీకాం ఆరో సెమిస్టర్‌ అకౌంట్స్‌ మేనేజింగ్‌ అకౌంటింగ్‌ పరీక్ష ప్రశ్నా పత్రం ఉదయం 11.42 గంటలకే లీకై సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఈ నెల 23 నుంచి ఎస్‌వీయూ పరిధిలో డిగ్రీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. వర్సిటీ పరిధిలోని 112 కళాశాలల్లో పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో 73 వేల మంది డిగ్రీ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వారిలో 25 వేల మంది చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    22
    Shares
  • 22
  •  
  •  
  •  
  •