క్రైమ్ (Crime) వార్తలు (News)

రూ.55 లక్షలతో పారిపోయిన డ్రైవర్‌ అరెస్టు!!

నగరంలోని జూబ్లీహిల్స్‌లో రూ.55 లక్షల నగదుతో ఉడాయించిన డ్రైవర్‌ శ్రీనివాస్‌ గురించి పాఠకులకు విదితమే! తాజాగా శ్రీనివాస్‌ ను పోలీసులు అరెస్టు చేశారు. ఊటీలో శ్రీనివాస్‌, అతని స్నేహితుడు విజయ్‌ను అదుపులోకి తీసుకుని నిందితుల నుంచి రూ.50లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

అసలు ఏంజరిగిందంటే.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 10సి ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో నివసించే స్థిరాస్తి వ్యాపారి సంతోష్‌రెడ్డి వద్ద ఆరు నెలల కిందట కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన శ్రీనివాస్‌ డ్రైవర్‌గా చేరగా కోకాపేటలో ఉంటున్న ఓ స్థిరాస్తి వ్యాపారికి రూ.55లక్షలు ఇచ్చి రమ్మని సంతోష్‌రెడ్డి డ్రైవర్‌కు సూచించగా ఈ నెల 25న మధ్యాహ్నం 2 గంటలకు శ్రీనివాస్‌ కారులో నగదు తీసుకొని బయలుదేరాడు కానీ సాయంత్రం 4 గంటలు దాటినా కోకాపేట చేరుకోకపోవడంతో ఫోన్‌ చేస్తే అందుబాటులోకి రాకుండా పరారయ్యాడు. దీంతో అనుమానించిన సంతోష్‌రెడ్డి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •