వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

హార్దిక్ పాండ్య టీ20 ప్రపంచకప్‌లో ఎలా ఆడాలంటే..??

రానున్న టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య జట్టులో ఎలాంటి పాత్ర పోషించాలి అనే అంశంపై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడాడు. కొన్నాళ్ల క్రితం హార్దిక్‌ వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకోవడంతో అప్పటినుంచి బౌలింగ్‌కు దూరంగా ఉంటూ ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ తరఫున కూడా బౌలింగ్‌ చేయడం లేదు. ఈ నేపథ్యంలో సెహ్వాగ్‌ స్పందించాడు. హార్దిక్ ఇప్పటికీ బౌలింగ్‌ చేయడానికి ఫిట్‌గా లేడు.. కాబట్టి టీ20 ప్రపంచకప్‌లో అతడు పూర్తిస్థాయి బ్యాటర్‌గా ఆడాలని, పాండ్య ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సమర్థుడని పేర్కొన్నాడు. హార్దిక్ పాండ్య మొదట బ్యాట్స్‌మన్‌. బౌలింగ్‌ చేయడం అనేది కేవలం బోనస్. అతను ఇప్పటికీ బౌలింగ్‌ చేయడానికి ఫిట్‌గా లేడు. బ్యాట్‌తో మ్యాచ్‌లను గెలిపించగలడు. టీ20 ప్రపంచకప్‌లో పూర్తిస్థాయి బ్యాటర్‌గా బరిలోకి దిగాలి. అలాంటి ఆటగాడు ఎల్లప్పుడూ నా జట్టులో ఉంటాడు’ అని సెహ్వాగ్‌ అన్నాడు.

భారత మాజీ క్రికెటర్ అజయ్‌ జడేజా కూడా పాండ్య గురించి మాట్లాడుతూ ‘హార్దిక్‌ను ముందుగా బ్యాట్స్‌మన్‌గా చూడాలి. బ్యాట్స్‌మెన్‌ ఎదగాలంటే బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందు పంపించాలి. ప్రస్తుతం అతను ముందుగా వచ్చి నిరూపించుకున్నాడు. మధ్య ఓవర్లలో చాలా బాగా ఆడగల నైపుణ్యం ఉంది. ముంబయి ఇండియన్స్‌ అతడిని బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుగా పంపించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది’ అని పేర్కొన్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •