రాజకీయం (Politics) వార్తలు (News)

పవన్ కళ్యాణ్‌ పర్యటనలో అభిమానికి గాయాలు??

జనసేన అధినేత, సీని హీరో పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటన నిర్వహిస్తున్న పామర్రు మండలంలోని కనుమూరు దగ్గర కారు ర్యాలీలో అపశృతిచోటు చేసుకుంది. పవన్ వెళ్తున్న మార్గంలో పలు వాహనాలు అనుసరిస్తున్న సమయంలో రెండు కార్ల మధ్య ఒక బైక్ ఇరుక్కుపోయిన ఘటనలో బైక్‌పై ఉన్న వ్యక్తికి కాలు విరిగిపోయింది. వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ కారు దిగి తన కారులో గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ యువకున్ని వెంటనే హాస్పిటల్ కు తరలించి మెరుగైన వైద్యం తక్షణమే అందించాలని వైద్యులకు పవన్ కళ్యాణ్ సూచించారు. తుపాన్ కారణంగా మూలంగా పంటలు కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించి వారి సమస్యలను స్వయంగా స్వయంగా తెలుసుకొనేందుకు పవన్ కల్యాణ్ నిన్న నుండి నాలుగు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది.

ఆయన నేరుగా హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం కృష్ణా జిల్లాలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. పలు చోట్ల రైతులు తుఫాను కారణంగా తాము పెట్టిన పెట్టుబడి పూర్తిగా నష్టపోయామని, తమకు ప్రభుత్వం నుంచి సాయం అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని పవన్ కళ్యాన్ వారికి హామీ ఇచ్చారు. శుక్రవారం వరకు పవన్ కళ్యాన్ పర్యటించనున్నారు. కృష్ణా జిల్లా పర్యటన అనంతరం పవన్ కల్యాణ్ పులిగడ్డ వంతెన మీదుగా గుంటూరు జిల్లాకు చేరుతారు. భట్టిప్రోలు, చావలి, పెరవలి ప్రాంతాల మీదుగా తెనాలి, నందివెలుగు, కొలకలూరుల్లో పర్యటిస్తారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •