జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

అశోక యూనివర్సిటీలో రీసెర్చ్ ఫెలో జాబ్స్‌!!

హర్యానలోని అశోక విశ్వవిద్యాలయానికి చెందిన సెంటర్ ఫర్ సోషియల్ అండ్ ఇంపాక్ట్ అండ్ ఫిలాంథ్రపి విభాగం రీసెర్చ్ ఫెలోషిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 2020లో ప్రారంభించిన ఈ రీసెర్చ్ విభాగం అభ్యర్థుల సామర్థ్యాలను పెంపొందించి, నాణ్యమైన ఫలితాలు సాధించేలా పరిశోధనలు నిర్వహించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా 10 మంది రీసెర్చ్ ఫెలో అభ్యర్థులను రిక్రూట్ చేసుకోనుంది.

ఎంపికైన అభ్యర్థుల ఇండియన్ ఫిలాంథ్రపీపై రీసెర్చ్ చేయాలి. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 30, 2021 న ప్రారంభమై అక్టోబర్ 31, 2021 వరకు కొనసాగుతుంది. రీసెర్చ్‌ఫెలోకి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకొనేందుకు అధికారిక వెబ్‌సైట్ https://csip.ashoka.edu.in/research-fellowship-2022/ ను సందర్శించండి.
సీఎస్ఐపీ రెండు రకాల అభ్యర్థులను ఎంచుకోనుంది. మొదటిది ఇండియాలో లాభాపేక్ష సంస్థలో పని చేసే వ్యక్తులు. ఇలాంటి వారు తమ సమయంలో సంగం రీసెర్చ్‌కి కేటాయించవచ్చు. అంతే కాకుండా తమ పనిని ఇద్దరు, ముగ్గురితో పంచుకోవచ్చు.

వ్యక్తిగత పరిశోధకులు మరియు భారతదేశంలోని లాభాపేక్షలేని సంస్థలతో పనిచేసే వ్యక్తులు, వారు పరిశోధనలో తమ సమయాన్ని సగానికి కేటాయించి, దీనిని సంస్థ నుండి మరో ముగ్గురు వ్యక్తులతో పంచుకోవచ్చు. పరిశోధన పూర్తిగా కంప్యూటర్‌, టాబ్లెట్ లేదా ఫోన్ ద్వారా నిర్వర్తించాలి. ఫెలోషిప్ ముగింపులో అభ్యర్థి CSIP వెబ్‌సైట్‌లో 8,000 పదాల హై-క్వాలిటీ వర్కింగ్ పేపర్ అప్‌లోడ్ చేసేలా రీసెర్చ్ సమాచారాన్ని అందించాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా అభ్యర్థి రీసెర్చ్ ఐడియా ప్రపోసల్‌తో సీవీ తయారు చేసుకోవాలి. అందులో విద్యార్హతలతో పాటు రీసెర్చ్‌కు సంబంధించిన పూర్తి సమాచారం పొందు పర్చాలి. అనంతరం అధికారిక వెబ్‌సైట్ https://csip.ashoka.edu.in/RF22 ను సందర్శించాలి. మీ సీవీని పీడీఎఫ్ ఫార్మెట్‌లో అప్‌లోడ్ చేయాలి. ఏదైన సందేహాలు ఉంటే csipresearch@ashoka.edu.in కు మెయిల్ చేసి నివృత్తి చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 31, 2021

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •