అంతర్జాతీయం (International) వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

ఇద్దరు ఒలింపిక్‌ స్టార్‌ హాకీ ఆటగాళ్ల రిటైర్మెంట్‌.. అది కూడా ఒకేరోజు!!

ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ బృందం చరిత్రాత్మక కాంస్య పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు స్టార్‌ ఆటగాళ్లు ఒకే రోజు రిటైర్మెంట్‌ ప్రకటించి ఆశ్చర్య పరిచారు. డ్రాగ్‌ ఫ్లికర్‌ రూపీందర్‌ పాల్‌ సింగ్‌, డిఫెండర్‌ బీరేంద్ర లక్రా గురువారం అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు పలికారు. కొన్ని గంటల తేడాతో వీరిద్దరూ తమ నిర్ణయం ప్రకటించడం ఆలోచించదగ్గ విషయం!

తొలుత రూపీందర్‌ సింగ్‌ ట్విటర్‌ ద్వారా తన రిటర్మైంట్‌ ప్రకటించారు. యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఆ తర్వాత కొద్ది సేపటికి బీరేంద్ర లక్రా కూడా అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు పలికినట్లు హాకీ ఇండియా ప్రకటించింది. అయితే వచ్చేవారం బెంగళూరులో ప్రారంభమయ్యే నేషనల్‌ క్యాంప్‌లో ఈ ఇద్దరికీ చోటు దక్కకపోవడంతో వీరు రిటైర్మెంట్ ప్రకటించినట్లు విశ్వసనీయ సమాచారం!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    8
    Shares
  • 8
  •  
  •  
  •  
  •