రాజకీయం (Politics) వార్తలు (News)

పవన్‌పై ప్రజలు తిరగబడే రోజు దగ్గరలో ఉంది: నారాయణస్వామి!!

తిరుమల శ్రీవారిని వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో నారాయణస్వామి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైకాపాను, సీఎం జగన్‌ను విమర్శించే అర్హత జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు లేదని ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మండిపడ్డారు. వైకాపాలో చేరేందుకు పవన్‌ ఎన్నో ప్రయత్నాలు చేసినా జగన్‌ దరి చేరనీయకపోవడంతో ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఈర్ష్యతోనే పవన్‌ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పవన్‌పై ప్రజలు తిరగబడే రోజు తప్పకుండా వస్తుందని నారాయణస్వామి విమర్శించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •