క్రైమ్ (Crime) వార్తలు (News)

నిజామాబాద్‌లో యువతికి మద్యం తాగించి సామూహిక అత్యాచారం!!

నిజామాబాద్‌లో నలుగురు యువకులు ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రి గదిలో మంగళవారం అర్ధరాత్రి ఈ దారుణం చోటు చేసుకోవడంతో అది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది డయల్‌ 100కు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు యువతి మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. యువతికి మద్యం తాగించి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు గుర్తించడంతో
బాధితురాలిని చికిత్స నిమిత్తం ఓ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •