దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 10,12,523 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 6,990 కొత్త కేసులు నమోదవడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.45 కోట్లకు చేరుకుంది. నిన్న ఒక్కరోజే 190 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు మరణించిన మొత్తం మృతుల సంఖ్య 4,68,980కి చేరింది. గత 24 గంటల్లో 10,116 మంది కరోనా నుంచి బయటపడ్డారు.