విజయవాడలోని ఎన్టీఆర్‌ వర్సిటీ నిధుల మళ్లింపునకు నిరసనగా రేపటి నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లు వర్సిటీ ఉద్యోగ, విద్యార్థి సంఘాల సమావేశంలో నిర్ణయించారు. సమావేశం ముగిసిన అనంతరం వర్సిటీ ప్రాంగణంలో నిరసన ర్యాలీ చేపట్టగా ఈ ఆందోళనకు విద్యార్థి సంఘాలు సంఘీభావం తెలిపాయి. వర్సిటీ నిధులను కాపాడతామంటూ వీసీ, రిజిస్ట్రార్‌కు వ్యతిరేకంగా ఉద్యోగులు నినాదాలు చేశారు. అనంతరం ఐకాస కన్వీనర్‌ వెంకటనారాయణ మీడియాతో మాట్లాడుతూ వర్సిటీ నిధుల మళ్లింపుపై ఆందోళన తీవ్రతరం చేస్తామని, వర్సిటీ పరిణామాలపై గవర్నర్‌కు నివేదిస్తామని అన్నారు. సీఎంవో ఒత్తిడితో వర్సిటీ నిధులు మళ్లిస్తున్నారని ఉద్యోగుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వానికి అప్పులు పుట్టక సంస్థల నిధులు మళ్లిస్తూ వర్సిటీని, ఉద్యోగులను రోడ్డున పడేస్తున్నారని ఆరోపణలు చేసారు.