దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైనప్పటికీ ముగిసిఎ సమయానికి మాత్రం నష్టాలు మూటగట్టుకున్నాయి. ఉదయం సెన్సెక్స్‌ 57,272.08 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమై ఇంట్రాడేలో 58,183.77 – 56,867.51 మధ్య కదలాడి చివరకు 195.71 పాయింట్ల నష్టంతో 57,064.87 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 16,956.25 వద్ద కనిష్ఠాన్ని తాకి, 17,324.65 వద్ద గరిష్ఠాన్ని తాకి చివరకు 70.75 పాయింట్లు నష్టపోయి 16,983.20 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో టైటన్‌, పవర్‌గ్రిడ్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, నెస్లే ఇండియా, బజాజ్‌ ఫినాన్స్, హెచ్‌సీఎల్‌ టెక్, ఇన్ఫోసిస్‌, టీసీఎస్, ఎన్‌టీపీసీ షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, బజాజ్‌ ఆటో, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌, ఎంఅండ్‌ఎం, మారుతీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.