శిల్పా శ్రీనివాస్ ఫ్రాడ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం రూ.90 కోట్లవరకు వసూళ్లు చేసి ఆ డబ్బుతో గండిపేట్ లో రూ.70 కోట్లతో లగ్జరి విల్లా కొన్నట్లు పోలీసుల విచారణలో బయట పడింది. జనాల దగ్గర తీసుకున్న పైసల్లో సగం పైసలను ఖర్చుపెట్టి శిల్పా శ్రీనివాస్ ఇల్లు కట్టారు. కిట్టి పార్టీలు, స్పా పార్టీల పేరిట దుబారా ఖర్చులు పెట్టారు. శిల్పా మీద మొత్తం 8 కేసులు నమోదయ్యాయి. నార్సింగిలో నాలుగు, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్ పీఎస్ లలో మొత్తం 8 కేసులు ఆమెపై పోలీసులు నమోదు చేశారు.

శిల్పా బాధితులు ఇంకా బయటకు వస్తున్న నేపథ్యంలో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు. ప్రైవేట్ బౌన్సర్ల సాయంతో బెదిరింపులపైనా పోలీసులు దృష్టి పెట్టారు. రొట్టెల పెనం వ్యాపారం పేరుతో శిల్పా మోసాలకు పాల్పడింది. జర్మనీ నుంచి రొట్టెల పెనం తెప్పిస్తామని చెప్పి వసూళ్లు చేసినట్లు పోలీసులు గుర్తించారు. రూ.2 వేలకు ఆన్లైన్ లో కొని రూ.25 వేలకు అమ్ముతూ శిల్పా శ్రీనివాస్ వ్యాపారం చేసినట్లు పోలీసులు కనిపెట్టారు.