దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్‌ 388 పాయింట్ల లాభంతో 57,649 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 117 పాయింట్ల లాభంతో 17,171 వద్ద ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫినాన్స్‌, పవర్‌గ్రిడ్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ నష్టాల్లో ఉంది.