దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 11,99,252 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 13,154 కొత్త కేసులు నమోదవడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.48 కోట్ల కు చేరింది. నిన్న ఒక్కరోజే 268 మంది మరణించడంతో ఇప్పటివరకు మరణించిన వారి మొత్తం సంఖ్య 4,80,860 కి చేరింది. గత 24 గంటల్లో 7,486 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3.42కోట్లకి చేరింది. ప్రస్తుతం 82,402 క్రియాశీల కేసులు ఉన్నాయి.

ఇక కరోనా కొత్త వేరియంట్ విషయానికి వస్తే గత 24 గంటల్లో కేసులు హఠాత్తుగా పెరిగాయి. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,000కి సమీపిస్తోంది. ప్రస్తుతం ఓమిక్రాన్ బాధితులు 961కి చేరగా, వీరిలో 320 మంది కోలుకున్నారు.