పశ్చిమ బెంగాల్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్కూళ్లు, పాఠశాలలను మూసివేస్తున్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుత కరోనా పరిస్థితిపై సమీక్ష చేపట్టాలని అడ్మినిస్ట్రేటివ్‌ సమావేశంలో అధికారులను ఆదేశించారు. ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువగా ఉన్నందు వలన కోల్‌కతాలో కంటోన్‌మెంట్‌ జోన్లను గుర్తించాలని పేర్కొన్నారు.

ఇప్పటికే 20 నెలల విరామం తర్వాత నవంబర్‌లో విద్యాసంస్థలు తిరిగి తెరుచుకున్నాయి. మళ్ళీ ఇప్పుడు కేసులు పెరుగుతుండటంతో మరోసారి మూతపడుతున్నాయి. మంగళవారం నాటికి బెంగాల్‌లో 752 కేసులు నమోదు కాగా ఇందులో కోల్‌కతాలోనే 204 కేసులు, 24 ఉత్తర పరగణాల్లో 102 కేసులు వచ్చాయి. అంతకు ముందు రోజు 439 కేసులు వెలుగుచూశాయి. దీంతో విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.