నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ లో కాంట్రాక్ట్ విధానంలో 11 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రాజెక్ట్ సైంటిస్ట్‌, ప్రాజెక్ట్ అసోసియేట్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

బీఎస్సీ, ఎమ్మెస్సీ, బీఈ/బీటెక్‌, పీహెచ్‌డీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 35 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వయసు కలిగి, అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లకు 20,000 రూపాయల నుంచి 56,000 రూపాయల వరకు వేతనం లభించనుంది.

ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 2021 సంవత్సరం జనవరి 2వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://www.nio.org/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు మేలు జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.