కొత్త సంవత్సరం సందర్భంగా ఏపీలో మద్యం ప్రియులకు డిసెంబర్ 31 న అర్ధరాత్రి వరకు మందు సరఫరా చేయొచ్చని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంటే మద్యం షాపులను డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్ షాపులను అర్ధరాత్రి ఒంటిగంట వరకు ఓపెన్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కానీ న్యూఇయర్ వేడుకలపై దేశంలోని పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం మాత్రం మద్యం షాపులకు అర్ధరాత్రి వరకు పర్మిషన్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే డిసెంబర్ 31న అర్ధరాత్రి మద్యం అమ్మకాలతో అధికంగా ఆదాయం వచ్చే అవకాశం ఉండటంతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పలువురు అభిప్రాయం పడుతున్నారు.