దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఫ్లాట్ గా ట్రేడింగ్ ను ప్రారంభించాయి. ఉదయం 9.45 గంటల సమయంలో సెన్సెక్స్‌ 43 పాయింట్ల లాభంతో 57,849వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 2 పాయింట్ల లాభంతో 17215 వద్ద ట్రేడవుతున్నాయి. ఆటో, చమురు, రియల్టీ, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సూచీల్లో అమ్మకాలు జరుగుతుండగా.. ఫార్మా, ఐటీ, లోహ రంగ సూచీలకు కొనుగోళ్ల మద్దతు లభించింది.