రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ కు చెందిన ఒక కుటుంబం ఉపాధి కోసం గతంలో దుబాయ్‌కి వెళ్లి ఈనెల 20న ఆరుగురు కుటుంబ సభ్యులు కలిసి స్వదేశానికి రాగా శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేశారు. ఫలితాల తాలూకు నివేదికలు రాక ముందే వారందరిని విమానాశ్రయం నుంచి వైద్యాధికారులు ఇంటికి పంపించి వేశారు. కానీ అప్పటికే బాలుడు (12) ఒమిక్రాన్‌ బారిన పడ్డారు. మూడు రోజులు ఇంటి వద్ద ఉన్న బాలుడు ఇరుగు పొరుగు వారితో కలిశాడు. 3 రోజుల తర్వాత వచ్చిన నివేదికలో బాలుడికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అప్రమత్తమైన వైద్య సిబ్బంది బాలుడు కలిసిన 40 మందికి వైద్య పరీక్షలు చేయగా, ముగ్గురికి ఒమిక్రాన్‌ సోకినట్టు తేలింది. బాధితులను గాంధీ అసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.