నేడు ఆద్యంతం ఒడుదొడుకుల్లో సాగిన సూచీలు చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి. ఈ ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సూచీలు ఆ తర్వాత కాసేపు పుంజుకున్నట్లే కన్పించాయి. సెన్సెక్స్‌ 57,755 పాయింట్ల వద్ద ప్రారంభమై ఒక దశలో 58వేల మార్క్‌ను దాటింది. కానీ మధ్యాహ్నం తర్వాత మార్కెట్లు ఒత్తిడిలోకి పడిపోయిన ఫలితంగా 57,578 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి పడిపోయింది. చివర్లో మళ్లీ కొనుగోళ్ల మద్దతు లభించినప్పటికీ స్వల్పంగా 12 పాయింట్లు నష్టపోయి 57,794 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ సైతం 17,146 – 17,264 మధ్య కదలాడి చివరకు 9 పాయింట్ల నష్టంతో 17,204 వద్ద ముగిసింది.

నిఫ్టీలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, సిప్లా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఎన్టీపీసీ, రెడ్డీస్‌ ల్యాబ్స్‌ షేర్లు లాభాల్లో ముగిసాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, రిలయన్స్ ఇండస్ట్రీస్‌, బజాజ్‌ ఆటో, యూపీఎల్‌ లిమిటెడ్‌, టాటా స్టీల్‌ షేర్లు నష్టపోయాయి.