బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో ప్రతినాయక పాత్రల్లో కనిపించే అజాజ్‌ఖాన్‌ను ముంబయి ఎయిర్పోర్ట్ వద్ద మాదక ద్రవ్యాల కేసులో ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. నిషేధిత మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తూ చిక్కిన షాదాబ్‌ను విచారించినప్పుడు అజాజ్‌ఖాన్ పేరు బయటకు రావడంతో ఇతను ఎక్కువగా తిరిగే అంధేరి, లోఖండ్వాలా వంటి కొన్ని ప్రాంతాల్లో ఎన్సీబీ తనిఖీలు చేపట్టింది. 2018లో కూడా నవీ ముంబయి యాంటీ నార్కోటిక్ పోలీసులు ఇతడిని ముంబయిలోని ఒక హోటల్లో అరెస్టు చేశారు. అలాగే 2020లో సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టినందుకు ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మాదక ద్రవ్యాల కేసులో అదుపులోకి తీసుకున్నారు.