కడప జిల్లా పులివెందుల మండలం కొత్తపల్లికి చెందిన మహిళా కూలీలు ముద్దనూరులో పనుల కోసం ఈ తెల్లవారుజామున జీపులో బయల్దేరిన క్రమంలో వాహనం ముద్దనూరు రోడ్డు ఎంవీఐ కార్యాలయం సమీపంలోకి రాగానే ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఇదే సమయంలో ఈ రెండు వాహనాలు రోడ్డు పక్కనే ఆగి ఉన్న మరో మున్సిపాలిటీ ట్రాక్టర్‌ను ఢీకొట్టాయి. ఈ ఘటనలో ఇద్దరు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో పారిశుద్ధ్య కార్మికులు కూడా ఉన్నారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు.