జాతీయం (National) వార్తలు (News)

డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు జరిపేవారికోసం…..

ఏప్రిల్ 1 నుండి బ్యాంకు నిబంధనలు మారుతున్నాయని సంగతి పాఠకులకు విదితమే! అలాగే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఉపయోగిస్తుంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవి ఏంటంటే… ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా జరిపే రికరింగ్ పేమెంట్స్‌కు అంతరాయం కలిగే అవకాశం ఉంది. మరియు బ్యాంకుల ఆటో డెబిట్ ఫెసిలిటీ ద్వారా మొబైల్ ఫోన్ బిల్స్, యుటిలిటీ బిల్లులు, మీడియా కంటెంట్ సబ్‌స్క్రిప్షన్, ఓవర్ ద టాప్ స్ట్రీమింగ్ సర్వీసులకు చెల్లించే పేమెంట్లకు కూడా అంతరాయం ఏర్పడొచ్చు. అలాగే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, టాటా పవర్, బీఎస్ఈఎస్ వంటి కంపెనీలపై కూడా ప్రభావం పడొచ్చు. అయితే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (రబీ) బ్యాంకులు, కార్డ్ నెట్‌వర్క్స్, ఆన్‌లైన్ వెండర్లు వంటి వాటికి మార్చి 31 వరకు గడువు ఇచ్చింది.

ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారం.. బ్యాంకులు, క్రెడిట్ కార్డు సర్వీస్ ప్రొవైడర్లు కస్టమర్లకు ఐదు రోజులు ముందుగానే డబ్బులు కట్ అవుతాయనే మెసేజ్‌ను పంపాలి. దీనికి కస్టమర్ నుంచి ఓకే అనే సమధానం రావాలి. అంటే కస్టమర్లు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా జరిపే రికరింగ్ పేమెంట్లకు సంబంధించిన రెండంచెల అథంటికేషన్ రూల్స్‌ను ఇవ్వన్నీ అనుసరించాల్సి ఉంది. అప్పుడు మాత్రమే ఆటో డెబిట్ సదుపాయం పని చేస్తుంది. ఆర్‌బీఐ కొత్త రూల్స్ ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయి. అయితే బ్యాంకులు, ఇతర వెండర్లు ఆర్‌బీఐ రూల్స్‌ను అమలు చేసే స్థితిలో లేకపోవడంతో ఇంకా ఎక్కువ గడువు కోరుతున్నా కూడా ఆర్‌బీఐ మాత్రం ఇందుకు అంగీకరించడం లేదని తెలుస్తోంది. అందువల్ల డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా జరిపే ఆటోమేటిక్ మంత్లీ పేమెంట్స్‌కు అంతరాయం కలీగ్ అవకాశం ఉంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.