బంగారం స్మగ్లింగ్ చేయడానికి మోసగాళ్లు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఈ ఉదయం కొందరు ప్రయాణికులు దుబాయ్‌ నుంచి మిక్సర్‌ గ్రైండర్‌, కత్తిరించే ఉపకరణాల్లో బంగారాన్ని అక్రమంగా శంషాబాద్‌కు విమానాశ్రయానికి తీసుకొచ్చారు. వీరిపై ఐదు కేసులు నమోదు చేసినట్లు, వారి వద్ద నుంచి 2.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.1.15 కోట్లు ఉంటుందన్నారు.

ఇదిలా ఉండగా మరొక ప్రయాణికుడు దుబాయ్‌ వెళ్లే విమానం ఎక్కడానికి వెళ్తుండగా అతని బ్యాగులో 30వేల యుఎస్‌ డాలర్లను గుర్తించిన అధికారులు కరెన్సీని కస్టమ్స్‌ యాక్ట్‌ 1962 కింద స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్టు చేశారు. 30వేల యుఎస్‌ డాలర్ల విలువ రూపాయిల్లో 21,48,000 ఉంటుందని వారు తెలిపారు.