దేశంలో చాలా మంది ఒక్కసారిగా ఇన్‌కం టాక్స్ వెబ్‌సైట్ పై పనిచేయడంతో ఒక్కసారిగా
కొద్ది సమయం పాటు బ్రేక్ పడింది. ఆధార్‌తో పాన్ (Permanent Account Number)ను తప్పనిసరిగా లింక్ చేయడానికి చివరి తేదీ మరియు ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటిఆర్) ను దాఖలు చేయడానికి కూడా ఈ రోజే చివరి రోజు కావడంతో భారతదేశం అంతటా వినియోగదారులు అదే పనిలో బిజీగా మారిపోయి ట్రాఫిక్ పెరిగిపోవడం వల్ల పేజీ క్రాష్ అయ్యింది. దీంతో వినియోగదారులు ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు.
ఫలితంగా, భారతదేశం అంతటా వినియోగదారులు భయాందోళనలకు గురవుతున్నారు. ఆదాయపు పన్ను శాఖ గడువును పొడిగించాలని, సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.