తెలంగాణలోని ఆదర్శ పాఠశాలల్లో 8 నుంచి 10వ తరగతి వరకు మిగిలిన సీట్లకు జూన్‌ 5న ప్రవేశ పరీక్ష ఉంటుంది. 6వ తరగతికి ఏప్రిల్‌ 15 నుంచి 30 వరకు, 8 నుంచి 10వ తరగతి వరకు ఏప్రిల్‌ 20 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆదర్శ పాఠశాలల డైరెక్టర్‌ తెలిపారు. జూన్ 1 నుంచి 6వ తేదీ వరకు వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయనీ, జూన్ 14న ఫలితాలు ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు జూన్ 18 నుంచి 20 వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టిన తరువాత జూన్ 21న తరగతలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.75, ఇతరులు రూ. 150 ఫీజు చెల్లించాలన్నారు. పూర్తి వివరాల కోసం http://telanganams.cgg.gov.in వెబ్‌సైట్‌ను పరిశీలించాలని డైరెక్టర్ తెలిపారు.