ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం ప్రకటన విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం హామీలు నెరవేర్చకపోవడంతో అప్పుల భారం పెరగడం ఒక కారణం అయితే అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించడం కూడా మరొక కారణమని పేర్కొంది. 2014 -2019 కాలంలో అప్పులు తారాస్థాయికి చేరుకున్నాయని, ఇక ఆదాయం భారీగా పడిపోయిన కరోనా సమయంలోనూ ఖర్చు ఎక్కువగా పెట్టామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వమే గతంలో ఎన్నడూ లేని విధంగా 18,48,655 కోట్ల అప్పు చేసిందన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తు చేసింది. గత ప్రభుత్వ విధానాల వల్లనే ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది ఏర్పడిందని పేర్కొంది.