వార్తలు (News)

విజృంభిస్తున్న డెల్టా ప్లస్‌ వేరియంట్‌!!

కరోనా వైరస్‌ తన రూపు మార్చుకుని డెల్టా ప్లస్‌ గా వెలుగులోకి వచ్చింది. ఈ డెల్టా ప్లస్‌ కేసులు ఈ నెల 23 నాటికి తెలంగాణలో రెండు నమోదైనట్లు, దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 70 డెల్టా ప్లస్‌ కేసులను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కరోనా వైరస్‌ ఇప్పటికే ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్లుగా మారి, రెండో దశలో దేశవ్యాప్తంగా డెల్టా వేరియంట్‌ బీభత్సం సృష్టించి, ఆ డెల్టా రకం మరికొన్ని మార్పులతో డెల్టా ప్లస్‌గా మారడంతో ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే అత్యధికంగా మహారాష్ట్రలో 23, మధ్యప్రదేశ్‌లో 11, తమిళనాడులో 10 ప్లస్‌ కేసులు ఉన్నాయి.

తెలంగాణ లో రాష్ట్రవ్యాప్తంగా మరో 9,141 మంది కరోనా కరోనా వైరస్‌ కొత్త రూపాంతరం(వేరియంట్‌) డెల్టా ప్లస్‌ సోకినట్టుగా వెలుగులోకి వచ్చింది. ఈ డెల్టా ప్లస్‌ కేసులు ఈ నెల 23 నాటికి తెలంగాణలో రెండు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీంతో తెలంగాణలో డెల్టా ప్లస్‌ ఉనికి ఉందని స్పష్టమైంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    44
    Shares
  • 44
  •  
  •  
  •  
  •