టెక్నాలజీ (Technology) వార్తలు (News)

వచ్చేవారంలో విడుదల కానున్న సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు!!

సీబీఎస్‌ఈ కొద్దీ రోజుల క్రితమే 12 వ తరగతి ఫలితాలను విడుదల చేసిన సంగతి పాఠకులకు విదితమే! ఈ నేపథ్యంలోనే 10వ తరగతి ఫలితాలు విడుదల చేసే దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణ అధికారి సన్యం భరద్వాజ్‌ తెలిపారు. వచ్చే వారంలో ఈ ఫలితాలను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. కానీ కచ్చితమైన తేదీని మాత్రం ఆయన వెల్లడించలేదు.

ఈ సందర్భంగా సీబీఎస్‌ఈలో ‘సెమిస్టర్‌’ విధానంపైనా ఆయన స్పందించారు. ఏడాదికి ఒకటి కంటే ఎక్కువ పరీక్షలు నిర్వహించేలా ఓ స్కీమ్‌ను రూపొందించినట్లు, దానివల్ల భవిష్యతుల్లో ఇలాంటి మహమ్మారి తరహా పరిస్థితులు ఎదురైతే పరీక్ష నిర్వహణ, ఫలితాల వెల్లడికి పెద్దగా సమస్యలు ఎదురవవని ఆయన అభిప్రాయపడ్డారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •