జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

భారీగా రిక్రూట్‌మెంట్ చేపట్టనున్న కాగ్నిజెంట్‌!!

ఉద్యోగుల వలసల్ని పూరించే దిశగా అడుగులు వేస్తున్న కాగ్నిజెంట్‌ ఈ ఏడాది 1,00,000 మందిని రిక్రూట్‌ చేసుకోనున్నట్లు గురువారం ప్రకటించింది. 2021లో అనుభవం కలిగిన నిపుణులతో పాటు 30,000 మంది ప్రెషర్స్‌ను తీసకుంటామని, 2022లో 45,000 మంది కొత్త గ్రాడ్యుయేట్స్‌ను చేర్చుకుంటామని కాగ్నిజెంట్‌ సీఈవో బ్రియాన్‌ హాంప్‌షైర్స్‌ చెప్పారు.

జూన్‌ క్వార్టర్‌ ఫలితాల్ని వెల్లడించిన సందర్భంగా అనలిస్టులతో మాట్లాడుతూ ఉద్యోగుల వలస తమకు ప్రధాన ఆందోళనగా ఉందని, ఈ జూన్‌ క్వార్టర్లో కంపెనీ నుంచి వలసలు రికార్డుస్థాయిలో 31 శాతానికి పెరిగాయని, వలసలు తగ్గించడానికి జీతాల పెంపు, ప్రమోషన్లు, నైపుణాల్ని పెంపొందించడం, జాబ్‌ రొటేషన్లు, రిటెంన్షన్‌ డాలర్లు వంటి పలు చర్యల్ని చేపట్టామని హాంప్‌షైర్స్‌ తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    49
    Shares
  • 49
  •  
  •  
  •  
  •