జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

పేటీఎంలో ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు!!

దేశంలోని అతిపెద్ద డిజిటల్ చెల్లింపు పరిష్కార సంస్థ పేటీఎం దీపావళికి ముందు రూ .16,600 కోట్ల ఐపీఓను తీసుకురావడం కోసం సన్నద్ధమవుతూ తన ఉద్యోగుల సంఖ్యను పెంచే దిశగా అడుగులు వేస్తుంది.

మొదట వాలెట్ గా మార్కెట్లోకి వచ్చిన పేటీఎం ప్రస్తుతం పేటీఎం పేమెంట్ బ్యాంకుతో పాటు మరెన్నో సౌకర్యాలను వినియోగదారుకుల అందిస్తోంది. ఇప్పుడు వీటిలో దేశవ్యాప్తంగా 20 వేల ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకోవాలని నిర్ణయించింది.

అండర్ గ్రాడ్యుయేట్లకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి పేటీఎం తన ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ (ఎఫ్ఎస్ఈ) కార్యక్రమాన్ని ప్రారంభించగా 18 సంవత్సరాలు నిండి.. 10, 12 లేదా గ్రాడ్యుయేట్ అయిన ఏ వ్యక్తి అయినా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తిగల వ్యక్తి Android స్మార్ట్‌ఫోన్ నుండి Paytm App ఉపయోగించి దరఖాస్తు చేసుకోవచ్చు. ద్విచక్ర వాహనాలు కలిగి ఉన్నవారికి, ప్రయాణానికి సౌకర్యవంతంగా మరియు ముందస్తు సేల్స్ అనుభవం ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

దరఖాస్తుదారులకు స్థానిక భాష మరియు ప్రాంతంపై మంచి పరిజ్ఞానం ఉండాలి. మార్కెట్లో ప్రధాన పోటీ, త్వరలోనే పబ్లిక్ ఇష్యూకు రానున్న సమయంలో పేటీఎం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఉద్యోగుల ద్వారా పేటీఎం, క్యూఆర్ కోడ్, పీవోఎస్ మెషీన్, పేటీఎం సౌండ్ బాక్స్, వ్యాలెట్, యూపీఐ, పేటీఎం పోస్ట్ పెయిడ్, మర్చంట్ లోన్స్, ఇన్సూరెన్స్ స్కీంలను ప్రమోట్ చేయాలని భావిస్తోంది. దీని ద్వారా భారీ వ్యాపార విస్తరణకు కంపెనీ పావులు కదుపుతుంది. ఈ క్రమంలో రిక్రూట్ చేయబడిన ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ కమీషన్ రూపంలో నెలవారీ 35,000 మరియు అంతకంటే ఎక్కువ జీతం సంపాదించడానికి అవకాశం ఉంటుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •