క్రైమ్ (Crime) జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

స్థానిక చట్టాలను గౌరవించని వారిపై కొరడా ఝులిపించిన గూగుల్‌!!

ఇంటర్నెట్‌లో వివాదాస్పద అంశాలు, కాపీపేస్ట్‌ చేసేవాళ్ళు, సెక్సువల్‌ కంటెంట్‌ అప్‌లోడ్‌ చేసే సైకోలపై గూగుల్‌ కొరడా ఝులిపించింది. స్థానిక చట్టాలను గౌరవించని, ఇతరుల ప్రతిష్టకు భంగం కలిగించే కంటెంట్‌ను పోస్ట్‌ చేస్తే సహించేది లేదని తేల్చి చెప్తూ ఆటోమేషన్‌, వ్యక్తిగత ఫిర్యాదు ఆధారంగా అభ్యంతరక కంటెంట్‌ని పెద్ద ఎత్తున తొలగిస్తోంది. గడిచిన మూడు నెలల కాలంలో ఇండియాకు సంబంధించి ఏకంగా 13.78 లక్షల కంటెంట్‌ని గూగుల్‌ తొలగించింది

కొత్త ఐటీ చట్టాలను అనుసరించి వ్యక్తిగత ఫిర్యాదుల ఆధారంగా గూగుల్‌ ఇప్పటి వరకు 2,17,095 లింక్‌లను తొలగించగా ఆటోమేషన్‌ పద్దతిలో ఇంతకు పదితంతల సంఖ్యలో అభ్యంతరకర, వివాదాస్పద సమాచారాన్ని గూగుల్‌ డిలీజ్‌ చేసింది. ఆటోమేషన్‌లో తొలగించిన కంటెంట్‌ మేలో 6,34,357 ఉండగా జూన్‌లో 5,26,866గా నమోదైంది. ఇందులో ఎక్కువ భాగం చిన్నారులను లైంగికంగా వేధించడం, జుగుప్సకరమైన హింసకు సంబంధించిన కంటెంట్‌ ఉన్నట్టు గూగుల్‌ పేర్కొంది.

ఏప్రిల్‌లో 27,700 మంది ఫిర్యాదు చేయగా వీటికి సంబంధించి 59,350 వివిధ కంటెంట్‌లని గూగుల్‌ తొలగించింది,
మేలో 34,883 ఫిర్యాదులు అందగా 71,132 కంటెంట్‌పై గూగుల్‌ చర్యలు తీసుకుంది.
జూన్‌లో 36,265 కంప్లైంట్స్‌ రాగా… గూగుల్‌ తొలగించిన కంటెంట్‌ సంఖ్య 83,613​కి చేరుకుంది.

భారత ప్రభుత్వం కొత్త ఐటీ చట్టాలను అమల్లోకి తెచ్చిన తర్వాత వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యల వివరాలను గూగుల్‌ క్రమం తప్పకుండా వెల్లడిస్తుండడంలో భాగంగా స్థానిక చట్టాలకు లోబడి ఇంటర్నెట్‌లో అ‍భ్యంతరకర నేర పూరిత, చట్ట విరుద్ధమైన కంటెంట్‌ (టెక్ట్స్‌, వీడియో, ఫోటోలు, ఆడియో) ఉందంటూ భారీ ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు.

గూగుల్‌కు అందుతున్న ఫిర్యాదుల్లో చట్టపరమైన పరువు నష్టం, కాపీరైట్‌, నకిలీ సమాచారం తదితర కేటగిరీలు ఎక్కువగా ఉండడం, కాపీరైట్‌, పరువు నష్టానికి సంబంధించినవే నూటికి ఎనభై శాతం ఉంటున్నాయి. తమ కంటెంట్‌ను మరెవరో పోస్టు చేశారని, తమ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ గూగుల్‌ని వ్యక్తిగతంగా ఫిర్యాదులు చేస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోండగా దానికి తగినట్టే గూగుల్ కూడా చర్యలు తీసుకుంటుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •