అంతర్జాతీయం (International) జాతీయం (National) వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

మహిళల డిస్కస్‌త్రో అర్హత సాధించిన కమల్‌ప్రీత్‌ కౌర్‌!!

ఒలింపిక్స్‌ మహిళల డిస్కస్‌త్రో ఈవెంట్‌లో తుదిపోరుకు నిర్వహించిన క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో శనివారం ఉదయం కమల్‌ప్రీత్‌ కౌర్‌ రెండో స్థానంలో నిలిచి అత్యద్భుత ప్రదర్శన చేయడంతో ఫైనల్‌కు అర్హత సాధించింది.

ఫైనల్‌ పోటీ ఆగస్టు 2న జరగనుండగా అక్కడ మొత్తం 12 మంది పోటీపడతారు. కమల్‌ప్రీత్‌ ఫైనల్లోనూ ఇలాంటి మెరుగైన ప్రదర్శన చేస్తే భారత్‌కు మరో పతకం ఖాయమనే చెప్పొచ్చు. ఇక క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో కమల్‌ప్రీత్‌ తొలి ప్రయత్నంలో 60.29 మీటర్లు విసరగా రెండో ప్రయత్నంలో 63.97 మీటర్లు డిస్కస్‌ త్రో చేసింది. చివరికి మూడోసారి 64 మీటర్లు సాధించి అటోమేటిగ్గా ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇక్కడ ఎవరైతే 64 మీటర్లు సాధిస్తారో వారు నేరుగా తుదిపోరుకు దూసుకెళ్తారు. అలాకాకపోతే అందరిలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన టాప్‌ 12 మందిని ఫైనల్‌కు ఎంపిక చేస్తారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •