అంతర్జాతీయం (International) జాతీయం (National) వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

చైనీస్ క్రీడాకారిణి టై జు యింగ్ చేతిలో పీవీ సింధు ఓటమి!!

శనివారం టోక్యో ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్ సెమీ ఫైనల్లో భారత క్రీడాకారిణి పీవీ సింధు ఓటమి పాలయ్యారు. సింధు చైనీస్ తైపీ క్రీడాకారిణి టై జు యింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. సింధుపై వరుసగా రెండు సెట్లు గెలుచుకున్న టై జు యింగ్ ఫైనల్‌కు చేరారు.

హోరాహోరీగా జరిగిన మొదటి సెట్‌ను 21-18 తేడాతో గెలిచిన టై జు యింగ్, రెండో సెట్‌ను 21-12 తేడాతో సొంతం చేసుకుని ఫైనల్‌కు చేరుకున్నారు. ఈ మ్యాచ్‌లో మొదటి నుంచీ సింధుకు గట్టిపోటీ ఇస్తూ వచ్చిన జూ యింగ్ మెల్లమెల్లగా ఆధిక్యం సాధించారు. సింధుకు రిలాక్స్ అయ్యే అవకాశమే ఇవ్వలేదు. ఈ మ్యాచ్‌లో ఓటమితో ఒలింపిక్స్ స్వర్ణం గెలవాలనుకున్న సిందు ఆశలు నెరవేరలేదు.

ఈ మ్యాచ్ ప్రారంభంలో సింధు ముందంజలో నిలిచి మ్యాచ్ సమయంలో సింధు దూకుడుగా కనిపించారు. కానీ మ్యాచ్ సాగే కొద్దీ జూ యింగ్ మ్యాచ్‌పై పట్టు సాధించడంతో సింధు చేతి నుంచి మ్యాచ్ చేజారిపోతున్నట్టు కనిపించింది. సింధు ఇప్పుడు కాంస్యం కోసం మరో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ రేపు సాయంత్రం జరగనుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    38
    Shares
  • 38
  •  
  •  
  •  
  •