జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు పెన్షన్.. నెలకు రూ. 1.25 లక్షలు??

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కుటుంబాలకు ఊరట కలిగేలా కేంద్ర ఉద్యోగుల ఫ్యామిలీ పెన్షన్ (కుటుంబ పింఛన్) పెంచాలని నిర్ణయించింది. ఒక ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైతే, వారు మరణిస్తే కుటుంబ సభ్యులకు ఇద్దరి పెన్షన్ వస్తుంది కానీ ఈ పెన్షన్ లిమిట్ నెలకు రూ.45 వేలు ఉండేది. అయితే ఇప్పుడు ఈ లిమిట్‌ను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

ఇప్పటి నుంచి ఉద్యోగుల పెన్షన్‌ను నెలకు గరిష్టంగా రూ.1.25 లక్షలు అందిస్తామని, కుటుంబ పెన్షన్లకు సంబంధించి 75 ముఖ్యమైన కొత్త రూల్స్‌ తీసుకొచ్చామని పెన్షనర్స్ వెల్ఫేర్ శాఖ ప్రకటించింది. పెన్షన్ తీసుకునే వృద్ధుల్లో అవేర్‌నెస్ కోసం ఈ రూల్స్‌ను తీసుకొచ్చినట్లు, కొత్త రూల్స్ ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ అందుకునే ఫ్యామిలీకి గరిష్టంగా రూ.1.25 లక్షలు తో పాటు డీఆర్ కూడా సమయానుగుణంగా జతవుతుంది. అలాగే నెలకు కనిష్టం మొత్తంగా రూ.9 వేల పెన్షన్ అందుకోవచ్చు. దీనికి కూడా డీఆర్ అదనంగా జతవుతుందని వెల్ఫేర్ శాఖ ప్రకటించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    138
    Shares
  • 138
  •  
  •  
  •  
  •