జాతీయం (National) వార్తలు (News)

సామాన్యుడిపై మరోసారి పెరగనున్న ధరల భారం??

దేశ వ్యాప్తంగా ఒకపక్క కొరోనాతో మరోపక్క ఇంధన ధరలు, నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడి మీద భారం పెరిగేలా పలు టెలికాం కంపెనీలు రీచార్జ్‌ టారిఫ్‌ల రేట్లను పెంచనున్నట్లు తెలుస్తోంది. తాజాగా భారతి ఎయిర్‌టెల్‌ తన యూజర్ల కోసం బేసిక్‌ స్మార్ట్‌ ప్రీ పెయిడ్‌ ప్లాన్‌ ధరను రూ. 49 నుంచి ఏకంగా రూ. 79 పెంచేయగా ఈ బేసిక్‌ ప్లాన్‌పై సుమారు 55 మిలియన్ల యూజర్లు ఆధారపడి ఉన్నట్టు తెలుస్తుంది. ఎయిర్‌టెల్‌ ఈ ప్లాన్‌లో భాగంగా అవుట్‌ గోయింగ్‌ కాల్స్‌కు సంబంధించి నాలుగు రెట్లు అధికంగా టాక్‌టైంను అందించి దాంతోపాటు మొబైల్‌ డేటాను డబుల్‌ చేసింది.

ఎయిర్‌టెల్‌ బాటలోనే వోడాఫోన్‌-ఐడియా కూడా టారిఫ్‌లను పెంచే దారిలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది. వోడాఫోన్‌-ఐడియా ఇప్పటికే రూ. 49 ప్లాన్‌ను విరమించుకుంటూ ఈ ప్లాన్‌కు బదులు కొత్తగా 28 రోజుల వ్యాలిడిటీతో రూ. 79 ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌-ఐడియా బాటలోనే పలు టెలికాం కంపెనీలు ప్రయాణించనున్నట్లు తెలుస్తోంది.

వచ్చే 6 నెలల్లో రీచార్జ్ టారిఫ్ ప్లాన్ల ధరలను 30 శాతం మేర పెంచాలని టెలికాం కంపెనీలు భావిస్తున్నాయి. టారిఫ్‌లను పెంచడంతో యూజర్ల నుంచి వచ్చే సగటు తలసరి ఆదాయాన్ని (ఏఆర్పీయూ) పెంచుకోవాలని టెలికాం కంపెనీలు యోచిస్తున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    48
    Shares
  • 48
  •  
  •  
  •  
  •