జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

పదోతరగతి అర్హతతో 25వేల పోస్టులు.. త్వరపడండి!!

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) గత నెలలో నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఎస్ఎస్బీ, ఐడీబీపీ, ఏఆర్, ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్ తదితర విభాగాల్లో సుమారు 25వేల కానిస్టేబుల్ జీడీ (జనరల్ డ్యూటీ) పోస్టులకు గత నెల 17న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు ఆఖరు తేదీ నేడే (31.08.21). ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని ఈ చివర నిమిషాన్ని అయినా ఉపయోగించుకోవచ్చు.

విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్శిటీకి సంబంధించిన పదో తరగతి/ మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత సర్టిఫికెట్ ఉండాలి.

అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.100, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్విస్‌మ్యాన్ కేటగిరికి చెందిన వారికి అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు లభిస్తుంది.

అప్లికేషన్ ఫీజుకు చివరి తేదీ: ఆన్‌లైన్ ద్వారా 02.09.2021 (23:30) తేదీ వరకు చెల్లించాలి. ఆఫ్‌లైన్ ద్వారా అయితే 04.09.2021 (23:30) తేదీ వరకు చెల్లించొచ్చు.

వయసు : 18 నుంచి 23 సంవత్సరాలు (నిబంధనల ప్రకారం వయసు పరిమితిలో సడలింపులు)

వేతనం: ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు రూ.21 వేల నుంచి గరిష్టంగా రూ.69 వేల వరకు వేతనంగా పొందొచ్చు.

వెబ్‌సైట్: https://ssc.nic.in/

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    2
    Shares
  • 2
  •  
  •  
  •  
  •