వార్తలు (News)

భారత్ లో 30,941 కొత్త కేసులు.. 350 మరణాలు..!!

దేశంలో తాజాగా 13,94,573 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 30,941 కొత్త కేసులు నిర్ధారణ కావడంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.27 కోట్లకి చేరింది. నిన్న ఒక్కరోజే 350 మంది మృతి చెందడంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,38,560 కు చేరింది. ప్రస్తుతం 3,70,640 మంది కొవిడ్‌తో బాధపడుతుండడంతో క్రియాశీల రేటు 1.13 శాతానికి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 36,275 మంది కోలుకోవడంతో రికవరీ రేటు 97.53 శాతంగా ఉంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •