వార్తలు (News)

డిస్కస్‌త్రోలో వినోద్‌పై అనర్హత వేటు.. ??

టోక్యో పారాలింపిక్స్‌లో డిస్కస్‌ త్రో క్రీడాంశంలో కాంస్యం గెలిచిన వినోద్‌ కుమార్‌పై పారాలింపిక్స్‌ నిర్వాహకులు అనర్హత వేటు వేసి అతడి నుంచి పతకం వెనక్కి తీసుకున్నారు. వినోద్‌ కుమార్‌ ఏ విధమైన అంగ వైక్యలం కలిగి ఉన్నాడన్న దానిపై స్పష్టత లేకపోవడంతో పారాలింపిక్స్‌ కాంపిటీషన్‌ ప్యానెల్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 41 ఏళ్ల వినోద్‌ కుమార్‌ డిస్కస్‌ త్రో ఫైనల్‌ ఈవెంట్‌లో 19.91 మీటర్లు విసిరి మూడో స్థానంలో నిలిచాడు. అయితే, ఈ ఫలితాన్ని కొందరు పోటీదారులు కాంపిటీషన్‌ ప్యానెల్‌ వద్ద ఫిర్యాదు చేయడంతో ఫలితాలను నిలిపివేశారు.

ఈ క్రమంలోనే సోమవారం పరిశీలించిన నిర్వాహకులు తాజాగా వినోద్‌ను అనర్హుడిగా ప్రకటించారు. దీంతో భారత్‌ ఒక పతకాన్ని కోల్పోయింది. బలహీన కండరాల శక్తి, పరిమిత కదలిక, అవయవ లోపం లేదా కాళ్ల పొడవులో వ్యత్యాసం ఉన్నవాళ్లు ఈ ఎఫ్‌52 వర్గీకరణ కింద పోటీపడే అవకాశం ఉంది. ఆగస్టు 22న నిర్వాహకులు ఈ వర్గీకరణ చేపట్టి ఇందులో పోటీపడే అథ్లెట్ల జాబితా రూపొందించారు.

అప్పుడు వినోద్‌ను ఎంపిక చేయగా ఈ క్రమంలోనే అతడు ఎఫ్‌52 డిస్కస్‌త్రో ఈవెంట్‌లో పాల్గొని మూడో స్థానంలో నిలిచాడు. కానీ జాతాగా అతడిని అనర్హుడిగా ప్రకటించారు. వినోద్‌ పతకం మినహాయిస్తే భారత్‌కు పారాలింపిక్స్‌లో ఇప్పటి వరకు ఆరు పతకాలు వచ్చాయి. భవీనా పటేల్‌, నిషాద్‌ కుమార్‌, యోగేశ్‌ కుతునియా, దేవేంద్ర జజారియా తలా ఓ రజతం సాధించగా సుందర్‌ సింగ్‌ గుర్జార్‌ కాంస్య పతకాన్ని సాధించారు. అవనీ మాత్రం భారత్‌కు పసిడి పతకాన్ని అందించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •