అంతర్జాతీయం (International) ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

వ్యాక్సిన్ పై వినూత్న ప్రచారం.. అస్థిపంజరం.. పక్కనే ఒక బోర్డు??

కోవిడ్-19 నుంచి కాపాడుకోవాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అనే విషయం చిన్న పిల్లవాడిని అడిగిన చెప్తాడు. కానీ వ్యాక్సిన్ వేయించుకునేందుకు చాలామంది ముందుకు రావడంలేదు. వ్యాక్సిన్ పై ఇంకా రకరకాల అపోహలు, అపార్థాలు ఉన్నాయి. ఈ అపోహలు, అపార్థాలను వీడి వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రచారం చేసేందుకు అమెరికాలోని ఉత్తర కెరోలినాకు చెందిన జెస్సీ జోన్స్ అనే ఓ వ్యక్తి వినూత్న ప్రచారం మొదలుపెట్టాడు. తన ఇంటిముందు నిలువెత్తు అస్జిపంజరాన్ని ఏర్పాటు చేసి ‘వ్యాక్సిన్ వేయించుకోనివారితో త్వరలోనే నేను కలుసుకుంటాను’ అని అస్జిపంజరం పక్కన బోర్డు పెట్టాడు. అంతేకాకుండా అస్థిపంజరం చుట్టూ సమాధుల నమూనాలను ఏర్పాటుచేశాడు. జెస్సి అత్త గతంలో కోవిడ్ 19తో బాధపడుతూ మృతిచెందింది. తన అత్తలా మరెవరూ ప్రాణాలు కోల్పోకూడదనే ఇలా వినూత్న ప్రచారం చేపట్టానని ఆయన వివరించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •