జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

అంతర్జాతీయ గుర్తింపు లభించిన కోటప్పకొండ!!

గుంటూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండపై కోలువైన త్రికోటేశ్వర స్వామి ఆలయానికి ఇప్పుడు ఐఎస్ఓ గుర్తింపు వచ్చింది. కేవలం అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్న సంస్థలకే లభించే ఐఎస్ఓ గుర్తింపు కోటప్పకొండ కు దక్కడం విశేషం! ఆలయ పరిసరాలు, భక్తులకు అందిస్తున్న సేవలు, ఆలయంలోని గదుల శుభ్రత వంటి అంశాలకు తోడు కొండపై ఉన్న ఆహ్లాద కరమైన వాతావరణంపై కూడా ఐఎస్ఓ అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తూ కోటప్పకొండకు ఐఎస్ఓ గుర్తింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పత్రాలను కూడా దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కు ఐఎస్ఓ సంస్థ ప్రతినిధులు అందించారు. అలాగే కోటప్పకొండ దేవస్థానం ప్రసాదం లడ్డు, అరిసెకు కూడా అంతర్జాతీయ గుర్తింపు ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రసాదం లడ్డు, అరిసె తయారీ విధానం, రుచి, వంటశాలలో పాటిస్తున్న శుభ్రత, నాణ్యతా ప్రమాణాల పట్ల అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. అరుదైన గుర్తింపుతో కోటప్పకొండ ప్రభ అంతర్జాతీయ స్థాయిలో వెలిగిపోవడం నిజంగా గర్వించదగ్గ అంశం!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •