జాతీయం (National) వార్తలు (News)

సరికొత్త గరిష్ఠాలకు చేరుకున్న మార్కెట్ సూచీలు!!

ఉదయం ఊగిసలాట ధోరణిలో కొనసాగిన మార్కెట్ సూచీలు అక్కడి నుంచి అంతకంతకూ పెరుగుతూ పోయి చివరకు లాభాల్లో ముగిసాయి. సెన్సెక్స్‌ 56,995 పాయింట్ల వద్ద మొదలైన ట్రేడింగ్ చివరకు 662 పాయింట్ల లాభంతో 57,552 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 201 పాయింట్లు పెరిగి 17,132 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సూచీ 17,153 వద్ద తాజా జీవన కాల గరిష్ఠాన్ని నమోదుచేసింది.

సెన్సెక్స్‌ 30 షేర్లలో 26 రాణించగా మిగిలిన నాలుగు డీలాపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్‌ తర్వాత అత్యధికంగా లాభపడిన వాటిల్లో బజాజ్‌ ఫినాన్స్‌ (5.08%), బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ (3.34%), ఏషియన్‌ పెయింట్స్‌, (3.13%), టీసీఎస్‌ (2.66%), టైటన్‌ (2.20%) ఉన్నాయి. నెస్లే ఇండియా 1.29%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.14%, రిలయన్స్‌ 0.47%, పవర్‌ గ్రిడ్‌ 0.26% చొప్పున నష్టపోయాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •