జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

‘నిట్‌’లో ఎంటెక్‌ విద్యార్థుల డాక్యుమెంట్ల పరిశీలన మొదలు!!

ఎంటెక్‌ రెండో బ్యాచ్‌కి సంబంధించి 85 మంది విద్యార్థులు ఉండగా వారికి సెప్టెంబర్‌ 1 నుంచి ఫిజికల్‌గా తరగతులు నిర్వహించాలని తాడేపల్లిగూడెం నిట్‌ యాజమాన్యం నిర్ణయించినట్లు చెప్పారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కోసం పదో తరగతి మార్కుల లిస్టు, జనన ధ్రువపత్రం, 12వ తరగతి/డిప్లమో మార్కుల జాబితా, ఒరిజినల్‌ డిగ్రీ ప్రొవిజినల్, మార్కుల జాబితా, గేట్‌ స్కోర్‌ కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలు, కేంద్ర ప్రభుత్వ ఫార్మాట్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌ 1 తర్వాత జారీ చేసిన ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్, టీసీ, మైగ్రేషన్‌ సర్టిఫికెట్, 2 పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలు, సీట్‌ అలాట్‌మెంట్‌ కాపీ, ఆధార్, ఫొటో గుర్తింపు కార్డు, ఎస్‌బీఐ ఖాతా పాస్‌బుక్‌ జిరాక్స్‌ కాపీ, ఒరిజినల్‌ సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలు రెండు సెట్లు వెంట తెచ్చుకోవాలని అధికారులు వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు సమాచారం!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •