అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) వార్తలు (News)

పంజ్ షేర్ దెబ్బకు తాలిబన్ల విలవిల?

ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ ని తమ వశం చేసుకున్న తాలిబాన్లకు అడ్డు అదుపూ లేకుండా అరాచకాలను సృష్టిస్తూ, ప్రజలను చిత్ర హింసలకు గురి చేస్తూ, ఆయుధాలతో బెదిరిస్తూ ఎదురు తిరిగిన వారిని చంపేస్తూ పరిస్థితులను తమ అధీనంలో ఉంచుకుంటున్నారు. కానీ ఇప్పటివరకు ఆఫ్ఘనిస్తాన్ లోని అన్ని ప్రాంతాలను కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు ఇప్పుడు వరకు సింహాల గూడు అని పిలువబడే పంజ్ షేర్ అనే ప్రాంతంలో మాత్రం అడుగు పెట్టలేకపోయారు.

ప్రాణాలైనా సరే అర్పిస్తాం కానీ తాలిబన్లకు మాత్రం తల వంచం అంటూ పంజ్ షేర్ ప్రజలు సైనికులు అందరు కూడా ప్రస్తుతం తాలిబన్లపై తిరుగుబాటు చేస్తున్నారు. దీంతో ఇక ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడం తాలిబన్లకు ఒక సవాలుగానే మారిపోయింది. తాలిబన్లు ఎన్ని ఇబ్బందులు సృష్టించినప్పటికీ ఆ ప్రాంతంలో సంక్షోభ పరిస్థితుల ను తీసుకు వచ్చినప్పటికీ అక్కడి సైనికులు మాత్రం అస్సలు వెనక్కి తగ్గడం లేదు. ఇక ఇప్పటికే పలుమార్లు పంజ్ షేర్ ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు తాలిబన్లు ప్రయత్నాలు చేశారు. కానీ చేదు అనుభవమే ఎదురైంది.

మరోసారి పంజ్ షేర్ ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించగా ఇక సైనికుల దెబ్బకు తాలిబన్లు విలవిలలాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అహ్మద్ మసూద్, ఆఫ్ఘనిస్తాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమృల్లా ఆధ్వర్యంలో ప్రస్తుతం సేనలు తాలిబన్లకు దీటుగా సమాధానం ఇచ్చారు. సైనికుల దాడికి ఏకంగా తాలిబన్లు భారీ సంఖ్యలో గాయపడ్డారు. ప్రస్తుతం కాఫీసా ప్రావిన్స్ పరిసర ప్రాంతాల్లో గాయపడిన తాలిబన్లు చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా అటు తాలిబన్లు కాల్పులకు తెగబడడంతో సైనికులు ప్రతిఘటించారని సమాచారం!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •