దేశంలో గత 24 గంటల వ్యవధిలో 12 లక్షల మందికిపైగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 16,764 కొత్త కేసులు నమోదవడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.48 కోట్లకు చేరింది. నిన్న ఒక్కరోజే 220 మరణాలు సంభవించడంతో ఇప్పటివరకు మరణించిన వారి మొత్తం సంఖ్య 4,81,080గా ఉంది. గత 24 గంటల్లో 7,585 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 3.42 కోట్లకు చేరింది. ప్రస్తుతం క్రియాశీల కేసులు 91,361కి చేరాయి.

గత 24 గంటల్లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1270కి పెరిగింది. అత్యధికంగా మహారాష్ట్రలో 450 కేసులుండగా.. దిల్లీలో ఆ సంఖ్య 320కి చేరింది. ఇప్పటివరకు ఒమిక్రాన్‌ నుంచి 374 మంది కోలుకున్నారు.

జిల్లాలవారీగా ఓమిక్రాన్ కేసుల సంఖ్య ..