శనగపిండిని ముఖ సౌందర్యం కోసం మన అమమ్మల కాలం నుండి ఉపయోగిస్తారన్న సంగతి అందరికి తెలిసిందే. శనగపిండి అన్ని చర్మ తత్వాలకు సరిపోతుంది. చర్మ సమస్యలను తగ్గించి చర్మం మృదువుగా మారటానికి శనగపిండి చాలా బాగా సహాయపడుతుంది.

కొన్ని ఫేస్ ప్యాక్ లను ఉపయోగించడం ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.. ఒక స్పూన్ శనగపిండిలో అరస్పూన్ ఆలివ్ ఆయిల్, అరస్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి 20 నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

ఒక స్పూన్ శనగపిండిలో రెండు స్పూన్ల తెల్ల చామంతి టీని కలిపి ముఖానికి పట్టించి 20 నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం మీద పేరుకున్న జిడ్డు,మురికి తొలగిపోతుంది.

ఒక స్పూన్ శనగపిండిలో రెండు స్పూన్ల గ్రీన్ టీ వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి 15 నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మొటిమల సమస్య నుండి బయట పడవచ్చు.

ఒక స్పూన్ శనగపిండిలో అరస్పూన్ అలోవెరా జెల్ కలిపి ముఖానికి పట్టించి 20 నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మంలో పొడి తగ్గి తేమగా ఉంటుంది.

ఒక స్పూన్ శనగపిండిలో ఒక స్పూన్ రోజ్ వాటర్ కలిపి ముఖానికి పట్టించి 20 నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది. ఈ ప్యాక్ ని వారంలో రెండు సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఈ కొత్త సంవత్సరంలో పార్లర్ కి వెళ్లే అవకాశం లేని వారు ఇలాంటి వంటింటి చిట్కాలు ఉపయోగించి మీ చర్మాన్ని మెరిపించుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ప్రయత్నించండి.